15, అక్టోబర్ 2013, మంగళవారం

"ఎప్పుడూఒప్పుకోవద్దురా ఓటమి"

 1992 లో సుమన్ ,ఐశ్వర్య జంటగా "పట్టుదల "అనే సినిమా వచ్చింది . అందులో సీతారామశాస్త్రి గారు రాసిన "ఎప్పుడూఒప్పుకోవద్దురా ఓటమి"అనే పల్లవి తో సాగే పాట జేసుదాస్ గారు పాడారు . ఏంతోస్పూర్తి దాయక మైన ఈ పాట జనానికి చేరువ కాలేక పోయింది ..అందరూవినాల్సిన పాట ఇది.

ముందు పాట వినండి.>>>>>                   
                                             
                     
పల్లవి:

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

చరణం1:

నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైనా
జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
వేగముంది ప్రాణముంది నెత్తురుంది సొత్తు ఉంది
ఇంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను
దీక్ష కన్నా సారథెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది
నీకె నువ్వు బాసటయితే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

చరణం2:

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా
పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హూంకరిస్తే
దిక్కులన్నీ ప్రిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి
అదుపులేని కదను తొక్కి
అవధులన్నీ అధికమించరా
త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమార్పలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
........
......................................................................................................................................................


  ఇపుడు సీతారామ శాస్త్రి గారి ఆవేదన చూడండి.ఈ పాట వెనుక ఆయన ఆవేదన ,మనకు స్పూర్తి నివ్వడం కోసం ఆయన పడిన తాపత్రయం ..నిజం గా అద్భుతం. డబ్బుకోసం ఎవరైనా రాస్తారు...మనకోసం మాత్రం శాస్త్రి గారే రాస్తారు.         ధన్యవాదాలు శాస్త్రి గారూ....               
                 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి