12, అక్టోబర్ 2013, శనివారం

ఆరాధన ....నా హృదయం లో నిదురించే చెలీ..




                ఆరాధన ....నా హృదయం లో నిదురించే చెలీ....
               
 రచన :ఆత్రేయ .సంగీతం :(ర)సాలూరి  రాజేశ్వర రావు ,గానం :ఘంటసాల

                             
                                 





పల్లవి:

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ

చరణం1:

నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ

చరణం2:

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే
పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ .....వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే....

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
............

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 

       వినండి :>>>     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి