1-10-2013 న ఈనాడు లో నేను నిర్వహిస్తున్న website గురించి ఇచ్చారు . మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అభినందించారు . అందరికీ ధన్యవాదాలు.
చాలా కాలం క్రితం ..రాజీవ్ విద్యా మిషన్ వారి ఉపాద్యాయ శిక్షణ కార్యక్రమానికి రిసోర్సుపర్సన్ గా పనిచేసాను .అప్పుడు PO జయప్రకాశ రావు గారు ఆ కార్యక్రమ డాక్యుమెంటేషన్ పని నాకు అప్పచెప్పారు ..ఆరోజున వచ్చిన ఆలోచన ఇది.ఒక సైట్ లోకి పత్రికా వార్తలు అప్లోడ్ చేస్తే ..బావుంటుందని అనిపించింది . ఆ తర్వాత నేను DMH స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శి గా చేరడం ..మా ఛైర్పర్సన్ Y.V.గోపాలరావు గారు కంప్యూటర్ విషయం లో ప్రోత్సాహా న్నివ్వడం తో కాంప్లెక్స్ కు ఒక సైట్ రూపొందించాను ... తదుపరి ..మా ఆఫీస్ కు కొత్త కార్యాలయం ప్రారంభమయిన తరువాత ..D I పెన్మెత్స రామరాజు గారి ప్రోత్సాహం తో మండల వనరుల కేంద్రానికి "mrcrajahmundryurban.yolasite.com పేరు తో ప్రారంభించిన చిరునామా ...ఈనాడు వెలుగు లోకి తెచ్చింది .
ఉపాద్యాయులు అందరికీ ..ముఖ్యం గా రాజమండ్రి నగర ఉపాధ్యాయులకు కావాల్సిన ,సులభం గా తీసుకునేలా కార్యాలయ సమాచారాన్ని అందించడం ,పత్రికా వార్తలు ,ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు పొందుపరుస్తాను .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి