11, అక్టోబర్ 2013, శుక్రవారం

గోరింటాకు చిత్రం లో ఈ పాట వినండి .

                                     
                                           https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg_UL2tHpGccIr4H5zFE3uoGoTb_qt057qNGU27MD9EXQguvFfB_qezpLucde_uFKa_CbhdidFpuZaNWf5q8rXGQ8URhyphenhyphen46X9ihJhiEkcpm2FtrecRkrfBTIXjOMOaGganex-1xsiYoMq3m/s1600/Gorintaku%2528Old%2529.jpg
                                    చిత్రం : గోరింటాకు
 సాహిత్యం: దేవులపల్లి ,సంగీతం :కే.వి.మహదేవన్ ,గానం: బాలు,సుశీల
  1.   ఎలా ఎలా దాచావు
    అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

    ఎలా ఎలా దాచావు
    అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
    ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
     
  2. పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎదా
    ఉసురొసుమనినా గుసగుసమనినా ఊగదేమది నీ మది
    నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో
    నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో
    ఎలా ఎలా దాచావు......
    అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
    ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ ......
     
  3. తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా
    తెరిచి ఉందనీ వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా
    దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో
    దొరికావు ఈనాటికీ
    దొంగను కానూ దొరనూ కానూ
    దొంగను కానూ దొరనూ కానూ నంగనాచినసలే కానూ
    ఎలా ఎలా దాచావు
    అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ.....

         



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి