6, ఏప్రిల్ 2020, సోమవారం

గోరింటాకు చిత్రం లో.. "ఇలాగ వచ్చి .. అలాగ తెచ్చి"

గోరింటాకు చిత్రం లో.. "ఇలాగ వచ్చి .. అలాగ తెచ్చి" .. అన్న పాట ను అందరూ .. ఆచార్య ఆత్రేయ గారు రాశారు .. అనుకుంటారు అందరూ .. కానీ.. ఈ పాటను రాసింది .. మహాకవి శ్రీ శ్రీ .. ఎపుడూ విప్లవ సాహిత్యం రాసే శ్రీ శ్రీ గారు ఇంత చక్కని ప్రేమ యుగళ గీతాన్ని అధ్బుతం గా రాశారు .. ఆనాటి ఆ సూపర్ హిట్ పాటను .. ఈ నాడు స్వరాభిషేకం లో మన బాలు గారు , సునీత గారు కూడా అంతే అద్భుతం గా మళ్ళీ పాడారు ..

4, ఏప్రిల్ 2020, శనివారం

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం  పనట తమతో తనకు తెలుసా హో!

నీ  వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేసావసలు సొగసా!

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

పరాకులో  పడిపోతుంటే కన్నె వయసు బంగారు
అరే అరే అంటూ వచ్చి తోడు నిలబడు
పొత్తిళ్ళలో పసిపాపల్లే పాతికేళ్ళ మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు

ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీకోసమే దూకుతోంది చిలిపి లాహిరి
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి నీతో
సావాసమే కోరుతోంది ఆదుకో మరి...

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

ఉండిండిలా ఉబికొస్తుందే కమ్మనైన కన్నీరు
తియ్యనైన గుబులిది అంటే నమ్మేదేవ్వరు 
మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు
గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ
నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం మాయ చేసావసలు సొగసా!
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే

తదిగిన | తకఝణు |  తదిగిన | తకఝణు
తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం 
తలవని తలపుగ యదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం

ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే
గుండెల్లోన వేగం పెంచావే | గుమ్మం లోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మయ్ | మళ్ళీ పుట్టి ఛస్తున్నానే
ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే

తదిగిన | తకఝణు |  తదిగిన | తకఝణు
తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం 
తలవని తలపుగ యదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం

ఊహలకు దొరకని సొగసా | ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా | మనసున ప్రతి కొస
నీ కనుల మెరుపుల వరస | రేపినది వయసున రభస
నా చిలిపి కలలకు బహుశా | యిది వెలుగుల దశ
నీ యెదుట నిలబడు చనువే వీసా | అందుకుని గగనపు కొనలే చూసా

ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే

మాయలకు కదలని మగువా | మాటలకు కరగని మధువా
పంతమును విడువని బిగువా | జరిగినదడగవా
నా కధని తెలుపుట సులువా | జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవ  | చెలిమిగ మెలగవా
నా పేరు తలచితే ఉబికే లావా | చల్లబడి నను నువు కరుణించేవా

ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే
గుండెల్లోన వేగం పెంచావే | గుమ్మం లోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మయి | మళ్ళీ పుట్టి ఛస్తున్నానే
ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే

తదిగిన | తకఝణు |  తదిగిన | తకఝణు
తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం 
తలవని తలపుగ యదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

ప‌ల్లవి
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
నా మాట అలుసా
నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం - 1
ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే...
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం - 2
తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కలుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

ఉప్పెన ...నీ కన్ను నీలి సముద్రం ...

Movie: Uppena
Director: Buchi Babu Sana
Music: DSP / Devi Sri Prasad
Lyrics: Shreemani
Singer: Javed Ali
Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty

నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం II2II
 నీ నవ్వు ముత్యాల హారం .. నన్ను తీరానికి లాగేటి దారం .. దారం ... II2II
నల్లనైన ముంగురులే .. అల్లరేదో రేపాయి లే ...నువ్వు తప్ప నాకింకో లోకాన్ని  లేకుండా  కప్పాయి లే ...
ఘల్లు మంటే నీ గాజులే ..జల్లు మంది నా ప్రాణమే ....అల్లుకుంది వాన జల్లు లా ప్రేమే
 నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం II2II
నీ నవ్వు ముత్యాల హారం .. నన్ను తీరానికి లాగేటి దారం .. దారం ... II2II
చిన్ని ఇసుక గూడు కట్టినా .. నీ పేరు రాసి పెట్టినా ..దాన్ని చేరిపేటి కెరటాలు  పుట్ట లేదు తెలుసా...
ఆ గోరువంక పక్కనా....రామచిలుక ఎంత చక్కనా ...అంతకంటే చక్కనంటనువ్వుంటే నా పక్కనా ,.....
అప్పు అడిగానే .. కొత్త కొత్త మాటలనీ ...
తప్పుకున్నాయే ..భూమిపైన బాష లన్నీ ...
చెప్పలేమన్నాయే ..అక్షరాల్లో ప్రేమనీ .....
నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం II2II నీ నవ్వు ముత్యాల హారం .. నన్ను తీరానికి లాగేటి దారం .. దారం ... II2II
నీ అందమెంత ఉప్పెనా .. నన్ను ముంచినాది చప్పునా ..
 ఎంత  ముంచేసినాతేలే బంతిని నేనే న నా .. .
చుట్టూ ఎంత చప్పు డోచ్చినా .. నీ సవ్వడేదో చెప్పనా ..
 ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా .. 
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడినీ... నీ ఊపిరే ప్రాణమైన  పిల్లాడినీ ..నీ ప్రేమా వల లో చిక్కుకున్న చేపనీ ..
 నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం II2II
నీ నవ్వు ముత్యాల హారం .. నన్ను తీరానికి లాగేటి దారం .. దారం ... II2II

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి ఫలానా పాట మాత్రమే రాయగలరు అనడానకి ఎవ్వరూ సరిపోరు. ఎందుకంటే ఆయన కలం నుంచి జాలువారిన పాటల్లో మెలోడీలున్నాయి.. మాస్ మసాలాలున్నాయి.. భక్తిరస గేయాలున్నాయి.. భావోద్వేగత గీతాలున్నాయి. ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో రాంజీ రాసిన ‘అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ’ అనే పాట ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. మళ్లీ అలాంటి గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాంజీ ‘మగువా మగువా’ అనే పాటను రాశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలోని ఈ ‘మగువా మగువా’ పాటను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం (మార్చి 8న) విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఉమెన్స్ డే రోజు మహిళలకు అంకితం ఇవ్వడానికి ఇది కరెక్ట్ సాంగ్ అనిపిస్తుంది. రాంజీ సాహిత్యం అంత అద్భుతంగా ఉంది. మరి అలాంటి సాహిత్యాన్ని మీరూ పాడేయండి..

పల్లవి
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట...
అలుపని రవ్వంత అననే అనవంట...
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత...
స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

చరణం
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా...
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా...
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా...
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా...
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా...
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా...

స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స...

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా...
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా...

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా

పల్లవి
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు (2 సార్లు)

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

చరణం
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా..

విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..

అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..

ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు