9, అక్టోబర్ 2013, బుధవారం

మా ఊరు చిడిపి



                                  మా ఊరు   చిడిపి.


మా చిన్నాన్న పరస హనుమంత రావు గారి పొలం. చిన్నప్పుడు ఎక్కువగా ఈ పోలానికే వెళ్ళే వాళ్ళం.అరటి తోట, మామిడి చెట్లు ,కందితోట ..వంగ తోట ఉండేవి . బోర్ దగ్గర స్నానం చేయడం,తాటి ముంజెలు తినడం,..కందికాయలు కాల్చుకుని తినడం ..ఇలా ఎన్నో తీపి గుర్తులు ...ఈ పొలం తో....
జానకిరాంఅన్నయ్య,శేషు ,క్రిష్ణన్నయ్య,వీళ్ళందరితోపాటు..పాడ్రు శ్రీనివాస్ ,ఆచంట దుర్గాప్రసాద్,ఎక్కిసెట్టి వెంకన్న,శర్మ, ఎలుగుబంటి  అప్పారావు ..ఇలా అందరూ..గుర్తుకు వచ్చారు .

ఇది ఒకప్పటి మా పొలం.గోదారి గట్టు దగ్గర..
ఒకప్పటి నందన వనం.చిడిపి లో మా ఇల్లు .ఇపుడిలా అందవిహీనం గా మిగిలిపోయింది అక్కడ నాన్న పడక కుర్చీలో కూర్చుంటే..ఇక్కడ అరుగుమీదచాలా మంది రైతులు కూర్చుని కబుర్లు చెప్పుకునే వారు. చరిత్రలో కి వెళ్ళిపోయినా..నా బాల్యం గుర్తుకు తెచ్చిన ఈ క్షణం మధురం. thank you నాన్నా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి