16, అక్టోబర్ 2013, బుధవారం

బంగారుగాజులు ...విన్నవించుకోనా ..చిన్నకోరికా...

   బంగారుగాజులు ..రచన :దాశరధి     విన్నవించుకోనా ..చిన్నకోరికా...
  
పల్లవి:

విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక
విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక

చరణం1:

నల్లని నీ కురులలో తెలతెల తెల్లని సిరిమల్లెనై
నల్లని నీ కురులలో తెలతెల తెల్లని సిరిమల్లెనై
పరిమళాలు చిలుకుతూ నే పరవశించి పోనా
విన్నవించుకోనా చిన్న కోరిక

చరణం2:

వెచ్చని నీ కౌగిట పవళించిన నవవీణనై
వెచ్చని నీ కౌగిట పవళించిన నవవీణనై
రాగమే అనురాగమై నీ మనసు నిండిపోనా
విన్నవించుకోనా చిన్న కోరిక

చరణం3:

తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై
తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై
అందరాని నీలి నింగి అంచులందుకోనా
విన్నవించుకోనా చిన్న కోరిక

చరణం4:

చల్లని నీ చూపులే చెలి వెన్నెలై విరబూయగా
చల్లని నీ చూపులే చెలి వెన్నెలై విరబూయగా
కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా

విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక
విన్నవించుకోనా చిన్న కోరిక


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



             
         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి