15, అక్టోబర్ 2013, మంగళవారం

దేశ ద్రోహులు ..చిత్రం లో జగమే మారినది మధురముగా ....

 దేశ ద్రోహులు ..చిత్రం లో జగమే మారినది మధురముగా ఈ వేళ..సాలూరి రాజేశ్వర రావు గారి మధుర బాణీ..లో ఘంటసాల గానం..  మన తారక రాముని అభినయం ...అన్నీ కల గలిపి ..జగం మధురము గా ఎందుకు మారదు???

పల్లవి:

జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం1:

మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే
మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింతా

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం2:

విరజాజులా సువాసనా స్వాగతములు పలుక,సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి అనురాగాలా తేలి
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎవ్వరి కోసమో ఎందుకింత పరవశమో

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
......

చూడండి>>>>>>>>>>>>>>>


       
                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి