రాజమకుటం ..సడిచేయకో గాలి .....
దేవులపల్లి వారి సలలిత సాహిత్యము, వేణు గారి శ్రావ్య సంగీతం, లీల గారి
సమధుర గాత్రం, ఉదాత్తమైన చిత్రీకరణ, పాత్రోచితమైన నటరత్న, రాజసులోచన
అభినయం, అశ్లీతకు, అసభ్యతకు బహుదూరముగానుండు బి.ఎన్ రెడ్డి గారి
దర్శకత్వం, రసికజనమనోభిరామముగ సమ్మేళన ఆనాటికి, ఈనాటికి, ఏనాటికైనా
అజరామరమై, తెలుగు చలన చిత్ర ఖ్యాతిని దిగ్దిగంతాలకు వ్యాప్తి చేసినదనటం
నిర్వివాదాంశం.
పల్లవి:
సడిచేయకో గాలి సడిచేయబోకె
సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకే
చరణం1:
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే
సడిచేయకే
చరణం2:
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడిచేయకే
చరణం3:
పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే
సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకో గాలి..............
చూడండి >>>>>>>>>>>> సడిచేయకో గాలి సడిచేయబోకె
సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకే
చరణం1:
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే
సడిచేయకే
చరణం2:
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడిచేయకే
చరణం3:
పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే
సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకో గాలి..............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి