11, అక్టోబర్ 2013, శుక్రవారం

జుమ్మంది నాదం..సిరిసిరిమువ్వ ..




     జుమ్మంది నాదం... 
   "సిరిసిరి మువ్వ" చిత్రం లోని ఈ పాట  మధురం గా   వుంటుంది .                              వినండి మరి..                  
              


రచన :వేటూరి ,సంగీతం ; కే.వి. మహదేవన్.గానం: బాలు ,సుశీల

  పల్లవి:


ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల

చరణం1:


ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
సలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా
స్వర మధురిమలొలికించగా
సిరి సిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల

చరణం2:

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాసమే వంగె నీకొసం
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం

చరణం3:

మెరుపుంది నాలో అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో అది మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందులయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి