29, అక్టోబర్ 2013, మంగళవారం

మురళీకృష్ణ'...నీ సుఖమే నే కోరుకున్నా...

            విషాద గీతాలలో ఈ పాట మధురమైనదని చెప్పాలి. ఎక్కువమంది విన్న పాట ,మన   అక్కినేని..నటిం(జీవి)చిన పాట...  1964 లో వచ్చిన 'మురళీకృష్ణ' చిత్రం లో  ఆత్రేయ సాహిత్యం,మాస్టర్ వేణు సంగీతం లో ఘంటసాల మధురం గా పాడిన పాట..నీ సుఖమే నే కోరుకున్నా....
పల్లవి:

ఎక్కడ ఉన్న ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం1:

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం2:

పసిపాప వలె ఒడి చేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేశాను
గుండెను గుడిగా చేశాను నువ్వుండలేనని వెళ్ళావు
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం3:

వలచుట తెలిసిన నా మనసుకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం4:

నీ కలలే కమ్మగ పండనీ నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ ఉండాలనీ దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని

ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
.............

          

ధనమేరా అన్నిటికీ మూలం

        " పెద్దల మాట చద్ది మూట "అంటారు. ఎప్పుడో 1967 లో ఆరుద్ర గారు చెప్పిన గొప్ప సత్యం..ఈ నాటికీ నిత్యనూతనమే ....అందరు ఆచరించవలసిన నిత్య సత్యం ...ధనమేరా అన్నిటికీ మూలం ...శ్రమ జీవికి జగమంతా లక్ష్మీనివాసం .....SV రంగారావు గారు జీవించారు ..ఈ పాత్రలో ...

పల్లవి:

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం

చరణం1:

మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ధనమేరా అన్నిటికీ మూలం

చరణం2:

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే
ధనమేరా అన్నిటికీ మూలం

చరణం3:

కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం.........



        

28, అక్టోబర్ 2013, సోమవారం

చెట్టుకింద ప్లీడరు అల్లిబిల్లికలలా రావే..

 చెట్టుకింద ప్లీడరు ..వంశీ గారిది ఒక ప్రత్యేకమైన బాణీ..రాఘవేంద్ర రావు గారి తరవాత మన గోదావరి తీరం లో పాటలు తీసే మరో మంచి దర్శకుడు వంశీ..... అల్లిబిల్లికలలా  రావే..                    

పల్లవి:

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా

చరణం1:

సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

చరణం2:

జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై
సంగతేదో తెలిపే తలపే సంగతేదో పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా
  చూడండి>>>>
                    

25, అక్టోబర్ 2013, శుక్రవారం

త్రిశూలం "వెలుగుకు ఉదయం


 త్రిశూలం  చిత్రం లో ఆచార్య ఆత్రేయ సాహిత్యం "వెలుగుకు ఉదయం " ., ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, ఈ పాట షూటింగ్ అంతా మా ఊరికి దగ్గరలోని కుమారదేవం లో జరిగింది. కృష్ణం రాజు ,శ్రీదేవి ..డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారిని  దగ్గరగా   చూడటం గొప్ప అనుభూతి. ఈ పాట ప్రారంభం లో కనపడే  పసుపు పువ్వుల మొక్కలు అన్నీ ప్లాస్టిక్ వి . ఎండిన కొమ్మలకు అలా కట్టారు . మద్యలో మామూలు పువ్వులు చల్లారు . గడ్డి బీడు ను సుందర వనం గా మార్చే చాతుర్యం,నైపుణ్యం .. రాఘవేంద్ర రావు గారిదే.. ఈ పాట , త్రిశూలం  సినిమా చాలా పెద్ద హిట్ ..
 
పల్లవి:

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా

చరణం1:

చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
నా ఆశకు రూపం నీవై
నా ఆశయదీపం నీవై
నా ఆశకు రూపం నీవై
నా ఆశయదీపం నీవై
నీవు నేను మనమౌదాం
నీవు నేను మనమౌదాం
మనమే మనకొక మతమౌదాం

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా

చరణం2:

జీవంపోసే రాగంకోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
జీవంపోసే రాగంకోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
ఈ మమతకు శృతినే నేను
ఈ నడతకు లయనే నేను
ఈ మమతకు శృతినే నేను
ఈ నడతకు లయనే నేను
నేను నేనను ఇద్దరము
నేను నేనను ఇద్దరము
నిన్న రేపటి సంగమము

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    చూడండి  >>>>>>>

      

రస యోగం (అంతర్యామి )....శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ


         మొన్న 23 న ఈనాడు చదివినప్పుడు ..మా Ðశ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ  గారు రాసిన  రస యోగం  (అంతర్యామి ).  లోని మాటలు ప్రతీ వ్యక్తీ చదివితీరవలసిందే.అపుడే నాకు..ఆనాడు వేటూరి గారు రాసిన 'మాటేమంత్రము' పాట బాగా గుర్తు కు వచ్చింది. వెంటనే నా బ్లాగ్ లో ఉంచాలనిపించింది . ఆ పాట వింటూ ..ఈ అంతర్యామి చదవండి.
                  
                                    సర్వేజనా సుఖినోభవంతు 
        పాట వినండి >>>>           

20, అక్టోబర్ 2013, ఆదివారం

వేటూరి "పాట"వాలు

          వేటూరి గురించి వేరే విశేషణాలు ఏమి రాయను?నాకు మొదటిగా నచ్చిన పాట ,అడవిరాముడు లో " "కృషివుంటే మనుషులు రుషులవుతారు "  చాలా చిన్న మాటలతో పెద్ద కధ, గిరిజనులకే కాదు ,అందరికీ ఆత్మ విశ్వాసం  నూరి పోశారు ...ఆయన పాట వం  ..గురించి చూద్దాం.....      

                

కాస్త ఫీల్ (కాఫీ) అయిన సునీత

       
మనం కూడా కాస్త ఫీల్ అవుదామా???




                        

సునీత పాడుతున్న పాట

         నా అభిమాన గాయని సునీత పాడుతున్న పాట

చూడండి >>>>> 

       

సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ భావావేశం


          సీతారామ శాస్త్రి గారి పాటలు ఇష్ట పాడని వారెవరు?సిరివెన్నెల కు రాసి ఆ సినిమా పేరు నే తన ఇంటిపేరు గా సార్ధకం చేసుకున్న మహనీయుడు. మరి ఆయన గురించి మాటల మాంత్రికుడి గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ భావాలు చూడండి . మన మదిలో కుడా అవే భావాలు మెదులుతాయి . అద్భుతం త్రివిక్రమ్ గారూ..మా భావాలను చాల చిన్న మాటలతో మాకే వినిపించి అలరిస్తున్న మీకు మా ధన్యవాదాలు . 

 వింటూ చూడండి >>>>>>