10, డిసెంబర్ 2013, మంగళవారం

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

                                                      చిత్రం: పంతులమ్మ.,
                                      రచన:వేటూరి ,సంగీతం:రాజన్..నాగేంద్ర.      
  సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే

యెలదేటి పాట చెలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
యెలమావితోట పలికింది నాలో
పలికించుకోవె మదికోయిలల్లే
నీ పలుకు నాదే
నా బ్రతుకు నీదే

తొలిపూత నవ్వే వన దేవతల్లే
పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవె యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే

మరుమల్లె తోట మారాకు వేసే
మారాకు వేపే నీరాక తోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళ
బ్రతికించుకోవే నీ పదము గానే
నా పదము నీవే
నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకొవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే యెద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే

                           
                   

3 కామెంట్‌లు: