4, డిసెంబర్ 2013, బుధవారం

సంతోషం చిత్రం లో సిరివెన్నెల ...నేతోలిసారిగా కలగన్నదీ నిన్నేకదా...

      సంతోషం చిత్రం లో సిరివెన్నెల ...నేతోలిసారిగా కలగన్నదీ నిన్నేకదా...అద్భుతమైన పాట..    

        
    నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవెం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా !

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

రెక్క్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలేను చెప్పు నువ్వే సావాసమా !

హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా !

నడకలు నేర్పిన ఆసవు కదా తడబదనీయకు ప్రతి దిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా !

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమ్రుతమనుకుని నమ్మడమే ఒక శాపమా !

నీ ఒడి చేరిన ప్రతి మది కి బాదే ఫలితమా
తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా !

పెదవులపై చిరునవ్వుల దగ కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా !

నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా !
పెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా !

పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా !

నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా !
                                                                                                                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి