29, డిసెంబర్ 2013, ఆదివారం

అడవిరాముడు ...ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి

   అడవిరాముడు ..రాజమండ్రి కుమారి టాకీస్ లో చూసాను . వేటూరి గారి పాటకు వంకలు పెట్టినా అందరి నోటా ఇదేపాట .. ఈ చిత్రం లో అన్ని పాటలూ  చాలా బావుంటాయి .. అందుకే నేటికీ వింటున్నాం .. చూస్తున్నాం...
రాఘవేంద్రరావు గారి పాటల చిత్రీకరణ అద్భుతం.. ఇక రామారావు గారు ,జయప్రద. ల నటన అదుర్స్..   
 ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలి..
నువ్వు కొంటేచూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి పారేసుకోవాల నారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెక్కి పోతొంది హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోని తొలిపొంగుల
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
హా..నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ జంట నా చేతి చలి మంట కావాలి
నీవింక కవ్వించకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే... దాగిపోవాలి...ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలి..
నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి హరి హరి హరి హరి

నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాక నా వలపు ఏరువాక
నిన్ తాక నీలిమబ్బు నా కోక
నే రేగి పోవాలి నేనూగిపోవాలి
నే రేగి పోవాలి నేనూగిపోవాలి
చెలరేగి ఊహలో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలిఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి ..కోకెత్తుకెళ్ళింది కొండగాలి..
నువ్వు కొంటేచూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి  

పారేసుకోవాల నారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి..నాకు ఉడుకెక్కి పోతొంది హరి హరి హరి హరి హరి హరి.....
లాలాల లాలాల లాలాల లలాల ..లలలా .లలలా ..................................................



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి