4, ఏప్రిల్ 2020, శనివారం

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం  పనట తమతో తనకు తెలుసా హో!

నీ  వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేసావసలు సొగసా!

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

పరాకులో  పడిపోతుంటే కన్నె వయసు బంగారు
అరే అరే అంటూ వచ్చి తోడు నిలబడు
పొత్తిళ్ళలో పసిపాపల్లే పాతికేళ్ళ మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు

ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీకోసమే దూకుతోంది చిలిపి లాహిరి
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి నీతో
సావాసమే కోరుతోంది ఆదుకో మరి...

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

ఉండిండిలా ఉబికొస్తుందే కమ్మనైన కన్నీరు
తియ్యనైన గుబులిది అంటే నమ్మేదేవ్వరు 
మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు
గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ
నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం మాయ చేసావసలు సొగసా!
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈవేళ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి