Director: Buchi Babu Sana
Music: DSP / Devi Sri Prasad
Lyrics: Shreemani
Singer: Javed Ali
Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty
…నీ కన్ను నీలి సముద్రం
.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం II2II
నీ నవ్వు ముత్యాల హారం .. నన్ను తీరానికి లాగేటి
దారం .. దారం ... II2II
నల్లనైన ముంగురులే ..
అల్లరేదో రేపాయి లే ...నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా
కప్పాయి లే ...
ఘల్లు మంటే నీ గాజులే
..జల్లు మంది నా ప్రాణమే ....అల్లుకుంది వాన జల్లు లా ప్రేమే
నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం II2II
నీ నవ్వు ముత్యాల హారం
.. నన్ను తీరానికి లాగేటి దారం .. దారం ... II2II
చిన్ని ఇసుక గూడు
కట్టినా .. నీ పేరు రాసి పెట్టినా ..దాన్ని చేరిపేటి కెరటాలు పుట్ట లేదు తెలుసా...
ఆ గోరువంక
పక్కనా....రామచిలుక ఎంత చక్కనా ...అంతకంటే చక్కనంటనువ్వుంటే నా పక్కనా ,.....
అప్పు అడిగానే .. కొత్త
కొత్త మాటలనీ ...
తప్పుకున్నాయే
..భూమిపైన బాష లన్నీ ...
చెప్పలేమన్నాయే
..అక్షరాల్లో ప్రేమనీ .....
నీ కన్ను నీలి సముద్రం
.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం II2II నీ నవ్వు ముత్యాల హారం .. నన్ను తీరానికి
లాగేటి దారం .. దారం ... II2II
నీ అందమెంత ఉప్పెనా ..
నన్ను ముంచినాది చప్పునా ..
ఎంత
ముంచేసినాతేలే బంతిని నేనే న నా .. .
చుట్టూ ఎంత చప్పు
డోచ్చినా .. నీ సవ్వడేదో చెప్పనా ..
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా ..
నీ ఊహలే ఊపిరైన
పిచ్చోడినీ... నీ ఊపిరే ప్రాణమైన
పిల్లాడినీ ..నీ ప్రేమా వల లో చిక్కుకున్న చేపనీ ..
నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం II2II
నీ నవ్వు ముత్యాల హారం
.. నన్ను తీరానికి లాగేటి దారం .. దారం ... II2II
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి