14, మే 2014, బుధవారం

   వంశీ పాటలు బాగా తీస్తారని తెలుసు ..కానీ బాగా రాస్తారని కూడా ఈ పాట వచ్చాకా తెలిసింది. రింగ్ టోను లు గా మారు మ్రోగింది ........

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా

నిదురే రాదు రాత్రంతా కలలు నెసెనాకు
వినగలనంటే తమాషగా ఒక్కటి చెప్పనా.. చెప్పు
ఇంద్రధనస్సు కింద కూర్చుని మాట్లాడదాం
అలాగే చందమామ తోటి కులసా ఊసులాడదాం
వింటుంటే వింతగా వుంది కొత్తగా వుంది ఎమిటీ కథనం
పొరపాటు కథ కాదు గత జన్మలోన జాజి పూల సువాసనేమో
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా

పువ్వుల నదిలో అందంగా నడచుకుంటు పోనా
ఊహల రచనే తియ్యంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడి నీ చంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా
అదేంటో మైకమే నన్ను వదిలినా పొద జరగదు నిజమో
జడివాన కురవాలి ఎదలోయలోకి జరిపోయే దారి చూడు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా

చిత్రం: అనుమానాస్పదం
గానం: ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషాల్
సంగీతం: ఇళయరాజా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి