14, మే 2014, బుధవారం

నీవు లేక వీణ పలుక లేనన్నది


      నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది
నీవు లేక వీణ

జాజి పూలు నీకై రోజు రోజు పూచె
చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే

చందమామ నీకై తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలుబోయె
నీవు లేక వీణ

కలలనైన నిన్ను కనుల చూతమన్న
నిదుర రాని నాకు కలలు కూడా రావే
కదలలేని కాలం విరహగీతి రీతి
కదలలేని కాలం విరహగీతి రీతి
పరువము వృధగా బరువుగా సాగే
నీవు లేక వీణ

తలుపులన్ని నీకై తెరచి వుంచినాను
తలపులెన్నో మదిలో దాచి వేచినాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను యెలగ రావా
నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది
నీవు లేక వీణ

చిత్రం: డాక్టర్ చక్రవర్తి
రచన: ఆత్రేయ
గానం: సుశీల
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 


       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి