మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరి చేరవెందుకు
ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరి చేరవెందుకు
అంత బిగువా మెట్టు దిగవా
ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా మాట వినవా
కొంత కష్టం అయినా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరి చేరవెందుకు
రెచ్చగొట్టినా నవ్వుతున్నదే
మత్తు కమ్మేసిందా కన్నె మనసుని
ఎంత కుట్టినా కెవ్వుమనదే
పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటే ప్రాణం ఇక నిలవనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరి చేరవెందుకు
ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు
చిత్రం: క్లాస్ మేట్స్
రచన: సిరివెన్నెల
గానం: మల్లిఖార్జున్, అంజనాసౌమ్య
సంగీతం: కోటి
దూరమెందుకు దరి చేరవెందుకు
ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరి చేరవెందుకు
అంత బిగువా మెట్టు దిగవా
ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా మాట వినవా
కొంత కష్టం అయినా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరి చేరవెందుకు
రెచ్చగొట్టినా నవ్వుతున్నదే
మత్తు కమ్మేసిందా కన్నె మనసుని
ఎంత కుట్టినా కెవ్వుమనదే
పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటే ప్రాణం ఇక నిలవనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరి చేరవెందుకు
ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు
చిత్రం: క్లాస్ మేట్స్
రచన: సిరివెన్నెల
గానం: మల్లిఖార్జున్, అంజనాసౌమ్య
సంగీతం: కోటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి