చిన్నప్పుడు
రేడియో లో లలిత గీతాలు కార్యక్రమం లో ఈ పాట ఎక్కువ వేసేవారు ..పాలగుమ్మి
విశ్వనాధం గారి సాహిత్యం...అందరినీ అలరించింది. ఇప్పటికీ ఇలా తలచుకుంటూ
ఉన్నామంటే ..ఆ నాటి సాహిత్యం ఎంత గొప్పదో కదా???
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఉ..
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగా...
||అమ్మ దొంగా||
కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...
||అమ్మ దొంగా||
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...||2||
||అమ్మ దొంగా||
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి... ||అమ్మ దొంగా||
రచన: పాలగుమ్మి విశ్వనాధం......
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఉ..
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగా...
||అమ్మ దొంగా||
కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...
||అమ్మ దొంగా||
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...||2||
||అమ్మ దొంగా||
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి... ||అమ్మ దొంగా||
రచన: పాలగుమ్మి విశ్వనాధం......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి