17, నవంబర్ 2013, ఆదివారం

ఆంధ్ర కేసరి చిత్రం లో మన రాజమండ్రి గోదావరి పాట

            ఆంధ్ర కేసరి చిత్రం లో మన రాజమండ్రి గోదావరి పాట..ఆరుద్ర విరచితం ,బాలు గానం ,సత్యం సంగీతం ..అన్నీ అన్నీ అద్భుతం.ఈ పాట వింటుంటే ..ఏదో తెలియని పులకింత ..కలుగుతుంది.ఈ మద్య పాడుతా తీయగా లో ఈ పాట గురించి ,మన బాలు విశ్లేషించిన తీరు అభినందనీయం..ఆచరణీయం .. ఈ పాట ఎలా పాడాలో ,ఇది చూసి మరింత మెరుగు పెట్టుకోవచ్చు ..
వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా షోభిల్లె రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా షోభిల్లె రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం….  వేదంలా…

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతలు ఏలిన ఓరు
ఆ కథలన్ని నినదించే గౌతమి హొరు….  వేదంలా…

శ్రీవాని గిరిజాస్చిరాయ దధతొ వక్షోముఖాన్వెషు
హే లోకానాం స్థితి మా వహంచ విహితాం స్త్రీ పుంసయొగొద్భవాం
తె వెదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితాహ వస్సురైర్భూయాసుహు
పురుషొత్తమాం భుజభవ శ్రీకంధరా స్రెయసె

ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము….  వేదంలా…

దిట్టమైన శిల్పాల దెవలాలు
కట్టు కధల చిత్రాంగి కనక మెడలు
దిట్టమైన సిల్పాల దెవలాలు
కట్టు కధల చిత్రాంగి కనక మెడలు
కొట్టుకొని పొయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు….  వేదంలా…

                        

3, నవంబర్ 2013, ఆదివారం

విరించినై విరచించితిని ఈ గీతం

          

అద్భుత భావగీతం :      విరించినై విరచించితిని ఈ గీతం

సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుంది అంటే దానికి కారణం ఆ పాట సంగీతం, అందులోని సాహిత్యం, గాయకుడి గానామృతం. ఈ కారణాల చేత అవి  ఇంతగా కదిలించాయి .    ఒక్కోసారి కొన్ని పాటలు మనలోని బాధను చల్లపరిచి ఆహ్లాదానిస్తాయి. ఆ పాటలలోని అందమైన పదాల అమరిక మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఎన్నో సందేహాలను పరిష్కరిస్తుంది. ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది కూడా. అలాంటి ఒక పాట సిరివెన్నెల చిత్రంలోని విరించినై .. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.  ఎంతో కాలంగా ప్రయత్నించి ఇప్పటికి ఆ పాట అర్ధాన్ని తెలుసుకోగలిగాను.
ఆ విశేషాలు నా బ్లాగులో దాచుకుని , మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
   విరించినై విరచించితిని ఈ గీతం ...........
                        చిత్రం : సిరివెన్నెల
                        గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
                        రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
                        సంగీతం :Sri. K.V. Mahadevan

                 
విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క
తలపున = ఊహలో

ప్రభవించినది = మెరిసినది

అనాది = మొదలు లేని

జీవన వేదం = సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)

ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో

స్పందన నొసగిన = ప్రాణాన్ని తట్టి లేపిన

ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము

కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే

ప్రతిబింబించిన = కొలనులో ప్రతిబింబించిన

విశ్వరూప విన్యాసం = సృష్టి యొక్క రూప ఆవిష్కరణ

ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో

ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన

విరించి = బ్రహ్మ యొక్క

విపంచి = వీణ

గానం = సంగీతం

సరస = రసముతో కూడిన( నవరసాల రసం )

స్వర = సంగీత స్వరం (, రి )
సురఝరీ = దేవనది, గంగ

గమనమౌ = ప్రవాహము ఐనట్టి

సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది

నే పాడిన జీవన గీతం గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం

విరించినై = నేనే బ్రహ్మని

విరచించితిని = రచించితిని
ఈ కవనం = ఈ కవిత్వం
విపంచినై = వీణనై
వినిపించితిని = వినిపిస్తున్నా
ఈ గీతం - ఈ పాట
విరించినై...
ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద

దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ

జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు

వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద

పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు

స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట

జగతికి = ప్రపంచానికి , విశ్వానికి
శ్రీకారము కాగా = మొదలు కాగా

విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి
ఇది భాష్యముగా = వివరణగా
విరించినై...  
జనించు = పుట్టిన
ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన
జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల
చేతన = చైతన్యం,(Activation)

స్పందన = Reverberation,resonance...

ధ్వనించు = శబ్దం
హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.

అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న

ఆది తాళం = ఆది తాళం

అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా
సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్య
విరించినై...  
నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట

ఎంత అద్భుతమైన భావం కలిగిన పాట
ఇది.

సిరివెన్నెల గారికి,విశ్వనాద్ గారికి ..శతధా వందనాలు....బాలు గారికి అభినందనలు .....

    

ఘంటసాల పుష్ప విలాపం..

             ఘంటసాల పుష్ప విలాపం..                                    
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు...
నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని
గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభూ...

ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన
స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు
మేము నీకేం అపకారము చేసాము???

గాలిని గౌరవింతుము సుగంధము పూసి
మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి
గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే    
యింతలో ఒక గులాబి బాల కోపంతో
మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..

ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలోనుండి
సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట
ముడుల మమ్ము అకట దయలేనివారు మీ యాడవారు .......
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ  జీవితమెల్ల   మీకయి త్యజించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా
:వోయీ మానవుడా..........
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
అందమును హత్య చేసి హంతకుండా
మైలపడిపోయెనో నీ మనుజ జన్మ..
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి
గైకొని నాపై నీ రేఖలను కరుణశ్రీ
ప్రసరింపుము ప్రభూ.
ప్రభూ..ప్రభూ..... ......     
    
   

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా......

         చిన్నప్పుడు రేడియో లో లలిత గీతాలు కార్యక్రమం లో ఈ పాట ఎక్కువ వేసేవారు ..పాలగుమ్మి విశ్వనాధం గారి సాహిత్యం...అందరినీ అలరించింది. ఇప్పటికీ ఇలా తలచుకుంటూ ఉన్నామంటే ..ఆ నాటి సాహిత్యం ఎంత గొప్పదో కదా???

  అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఉ..
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగా...
||అమ్మ దొంగా||
కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...
||అమ్మ దొంగా||
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...||2||
||అమ్మ దొంగా||
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి...
||అమ్మ దొంగా||
రచన: పాలగుమ్మి విశ్వనాధం......

               

2, నవంబర్ 2013, శనివారం

సునీత .ఇంటర్వ్యూ ......

              సునీత .ఇంటర్వ్యూ ......   
సుప్రసిద్ధ గాయని...డబ్బింగ్ ఆర్టిస్ట్...anchor...సునీత ..ఆంధ్రజ్యోతి ఛానల్ లో స్థిమితం గా మాట్లాడింది ..
 చూద్దాం...>>>>>>.

                 

బంగారు గాజులు చిత్రం లో..అన్నయ్య సన్నిధి ...

               బంగారు గాజులు  చిత్రం లోడాక్టర్ సి.నారాయణరెడ్డిగారి సాహిత్యం ..ఆనాటి అనుబంధాలకు  అద్దం  పడుతుంది . నేడు అంతా  బిజీ ..బిజీ ..సెల్ ఫోన్ పలకరింపులు మాత్రమే మిగిలాయి ..ఈ రోజు సాక్షి పేపర్ లో ఒక రచయిత భావాలు ..మళ్ళీ ఆ పాట ను గుర్తుకు తెచ్చాయి . 

ఒకసారి మళ్ళీ చూద్దాం.>>>>>>>>